జాతీయ వార్తలు

2022లో అంతరిక్ష పరిశోధనకు వెళ్లే వ్యోమగాములకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘గగన్‌యాన్’ అంతరిక్ష పరిశోధనకు వెళ్ళే వ్యోమగాములకు ఆరోగ్య పరిరక్షణపై ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సీఎన్‌ఇఎస్ అధ్యక్షుడు జీన్-వైవిస్ లె గాల్ వచ్చే వారం బెంగళూరుకు చేరుకున్న తర్వాత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకోనున్నట్లు గగన్‌యాన్ అధికారులు తెలిపారు. 2022 సంవత్సరంలో భారత్ గగన్‌యాన్ పేరిట అంతరిక్ష పరిశోధన చేపట్టనున్నది. భారత్‌కు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఈ పరిశోధనలో పాల్గొంటారు. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి, ఏ సమయంలో ఎటువంటి మందులు (ఔషధాలు) తీసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలపై వ్యోమగాములకు ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం వ్యోమగాముల జాబితాను సిద్ధం చేస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారులు తెలిపారు. శిక్షణ పొందిన వారిలో నుంచి మళ్లీ ఎంపిక ఉంటుందన్నారు. వీరికి రెండు వారాల పాటు ఫ్రెంచ్ బృందం శిక్షణ ఇస్తుందని అధికారులు చెప్పారు.