జాతీయ వార్తలు

కాశ్మీర్ సమస్యలు స్వయంగా పర్యవేక్షిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 21: జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రజాసమస్యలు స్వయంగా తెలుసుకోవాలని చేపట్టిన ‘ఔట్ రీచ్’ కార్యక్రమంలో భాగంగా కాశ్మీర్ పర్యటనకు నఖ్వీ విచ్చేశారు. ‘ప్రజలకు అత్యంత సన్నిహితంగా వెళ్లి వారి సమస్యలు వినడం.. అవసరాలను తెలుసుకొని వాటి పరిష్కారాలను సూచించడమే’ తాము చేపట్టిన ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నఖ్వీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. శ్రీనగర్ శివారులోని హర్వాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలను మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నఖ్వీ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్‌లోని సామాన్య ప్రజానీకానికి అందాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య ఉద్దేశమని నఖ్వీ వివరించారు. ‘కాశ్మీర్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలన్నదే ప్రభుత్వ ధ్యేయమనీ.. అవినీతిని పారదోలడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది’ అని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. జమ్మూకు 31మంది మంత్రులు వెళ్తుండగా.. కేవలం ఐదుగురు మంత్రులు మాత్రమే కాశ్మీర్‌కు ఎందుకు వచ్చారని అడుగగా.. ప్రజలకు చేరువగా వెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఇంతటితో ఆగిపోయేదీ కాదనీ.. ఇది నిరంతర ప్రక్రియ అని నఖ్వీ వివరించారు.