జాతీయ వార్తలు

పాక్‌తో యుద్ధమా..? చెప్పడం చాలా కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంజావూర్ (తమిళనాడు), జనవరి 20: పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేవా? అన్నది చెప్పడం చాలా కష్టమని త్రిదళాధితి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. సోమవారం తంజావూర్‌లో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళంలోకి చేర్చిన సందర్భంగా బిపిన్ రావత్ మాట్లాడారు. పాక్‌పై యుద్ధంపై ఈ సందర్భంగా మాట్లాడుతూ యుద్ధం జరుగుతుందా? లేదా? అన్నది చెప్పడం కష్టమేననీ.. అయితే, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ త్రిదళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్నివేళలా భారత్ సిద్ధంగా ఉంటుందని రావత్ ఈ సందర్భంగా పేర్కొంటూ.. మాకు అప్పగించే ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించి.. దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని రావత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఆర్మీ, నేవీ, భారత వైమానిక దళాలను మరింత పటిష్టం చేయడమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. మూడు దళాలను స్వయంగా పర్యవేక్షించేందుకు భారత్‌లో మొట్టమొదటిసారిగా త్రిదళాధిపతి పదవిని ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. ‘సమగ్రంగా.. సంయుక్తంగా మూడు దళాలు కలిసి పనిచేయడమే ఉద్దేశంగా గత నెల 30వ తేదీన సీడీఎస్ పదవిని ఏర్పాటు చేశారని’ అన్నారు. ఆగ్నేయ పెనిన్‌సులాలోని ఎయిర్ బేస్‌ను మరింత సమర్థవంతంగా పనిచేయడంలోకీలకభూమిక వహించనున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
దక్షిణ భారతదేశంలోనే అత్యున్నత ఫైటర్ జెట్ అయిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాన్ని వైమానిక దళంలోకి అనుసంధానం చేయడం ద్వారా సమద్ర తీర ప్రాంతంలో గస్తీని మరింత వ్యూహాత్మకంగా సమర్థవంతంగా చేయడం సాధ్యవౌతుంది. భూమ్యాకాశాలతో పాటు సముద్ర మార్గంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా సాధ్యపడుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.
'చిత్రం...త్రిదళాధిపతి బిపిన్ రావత్