జాతీయ వార్తలు

అమలు చేయకపోతే.. రాజ్యాంగ వ్యతిరేకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేయకూడదని కొన్ని రాష్ట్రాలు ప్రతిపాదించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత అన్ని రాష్ట్రాలపై ఉందని ఆమె పేర్కొన్నారు. ‘సీఏఏకు వ్యతిరేకంగా ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ఒక రాజకీయ ప్రకటనలాగా ఉంది. దానిని మేము అర్థం చేసుకోగలం. కాని, వారు (సీఏఏను) అమలు చేయబోమని చెబుతున్నారు. అది చట్టానికి వ్యతిరేకం. అలా చెప్పడం రాజ్యాంగవిరుద్ధం’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. చెన్నై సిటిజెన్స్ ఫోరం ఆదివారం నాడిక్కడ సీఏఏపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె సమావేశంలో పాల్గొన్న వారిలో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో సీఏఏ అమలును వ్యతిరేకించాయని పేర్కొన్నారు. ‘సీఏఏను అమలు చేయబోమంటూ ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయగలదు. అది రాజకీయ ప్రకటన అవుతుంది. వారు అలా ముందుకెళ్లొచ్చు. దానిని మేము వ్యతిరేకించబోము. అయితే, పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉంది’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.
సీఏఏకు అనుకూలంగా ప్రజల మద్దతు కూడగట్టడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ‘జన్ జాగరణ్ అభియాన్’ పేరిట నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా మంత్రి ఇక్కడికి వచ్చారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం గత వారం సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏను రాజ్యాంగ వ్యతిరేకమయిన చట్టంగా ప్రకటించాలని ఆ పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
'చిత్రం... పౌరసత్వ చట్టంపై ఆదివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్