జాతీయ వార్తలు

నడ్డా ఏకగ్రీవం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నిక జరగనున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్థానంలో ప్రస్తుతం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఉన్న జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. నడ్డా అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసి నడ్డాను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. కాబట్టి నడ్డాకు పోటీగా మరో నామినేషన్ దాఖలయ్యే అవకాశమే లేదు. పార్టీ సీనియర్ నాయకుడు రాధా మోహన్ సింగ్ పార్టీ ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాధామోహన్ ఎన్నికల షెడ్యూలును ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ప్రకారం సోమవారం (20న) ఉదయం
నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నామినేషన్లు దాఖల చేసేందుకు గడువు విధించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నామినేషన్ల పరిశీలన నిర్వహించి, ఒక్క నామినేషనే దాఖలైతే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణాధికారి రాధా మోహన్ అధికారికంగా ప్రకటిస్తారు. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే ఆ మర్నాడు ఎన్నిక నిర్వహిస్తారు. అయితే ఆ పరిస్థితికి ఛాన్స్ లేదు. బీజేపీ ఏకాభిప్రాయంతో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నది.
నడ్డా ఎంపికతో ఐదున్నర సంవత్సరాలుగా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న అమిత్ షా పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతను పార్టీ నూతన సారథికి అప్పగించడం జరుగుతుంది. మోదీ-అమిత్ షాల టీం 2014 సంవత్సరంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేందుకు విశేషంగా కృషి చేసింది. 2019లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ మరోసారి విజయదుందుభి మోగించింది. కాగా రెండోసారి పార్టీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రిగా అమిత్ షాకు బాధ్యత అప్పగించారు. అయితే పార్టీలో ఒక వ్యక్తి జంట పదవుల్లో ఉండరాదన్న నియమం ఉండడంతో, అప్పటి నుంచే నూతన రథ సారధ ఎంపిక కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరకు తమకు నమ్మిన నాయకుడైన జేపీ నడ్డాకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో నడ్డాకు అనుబంధం ఉంది. పైగా పార్టీలో, రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా పేరు సంపాదించారు. నడ్డా లోగడ మోదీ మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వర్తించారు.
'చిత్రం... జేపీ నడ్డా