జాతీయ వార్తలు

చట్టాన్ని చదవి మాట్లాడండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుబ్లీ (కర్నాటక): పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ముందుగా దానిని పూర్తిగా చదవాలని, ఆ తర్వాతే ప్రతిస్పందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సలహా ఇచ్చారు. ఈ చట్టం వల్ల దేశంలోని ముస్లింల పౌరసత్వం పోతుందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను అమిత్ షా తిప్పికొట్టారు. అలాగే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు దళిత వ్యతిరేకులని పేర్కొన్నారు. ముస్లింల పౌరసత్వాన్ని హరించే నిబంధన ఏదీ సీఏఏ చట్టం లేదని, కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సరైన అవగాహన లేకుండా గందరగోళం సృష్టిస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. ‘ముందు మీరు చట్టాన్ని చదవండి. అందులో ముస్లింల పౌరసత్వాన్ని తొలగించిన నిబంధన ఏమైనా ఉంటే దానిపై మా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చర్చకు సిద్ధమవుతారు’ అని అన్నారు. పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ప్రచారంలో భాగంగా శనివారంనాడు ఇక్కడ జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టు పార్టీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జేడీఎస్, బీఎస్పీ, సమాజవాది పార్టీలు పౌరసత్వ చట్టంపై ఓటుబ్యాంకు రాజకీయాలు సాగిస్తున్నాయని అన్నారు.
'చిత్రం... హుబ్లీలో శనివారం జరిగిన బీజేపీ ప్రజా చైతన్య ర్యాలీలో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా