జాతీయ వార్తలు

20న నడ్డాకు బీజేపీ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా (59) ఈ నెల 20న (ఏకాదశి) పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు మూహుర్తం ఖరారైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి రాధామోహన్ సింగ్ జారీ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూలు ప్రకారం జాతీయ అధ్యక్ష పదవి కోసం సోమవారం ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల మధ్య నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన అదే రోజు జరుగుతుంది. నామినేషన్లను మధ్యాహ్నం రెండున్నరలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే పక్షంలో జనవరి 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని రాధామోహన్ సింగ్ చెప్పారు. అయితే పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా మినహా మరే ఇతర నాయకుడు నామినేషన్ పత్రాలను దాఖలు చేయరనేది అందరికి తెలిసిన విషయమే. జేపీ నడ్డా సోమవారం ఉదయం 10 గంటలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రస్తుత అధ్యక్షుడు, హోం శాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు నడ్డా నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల తరువాత నడ్డా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాధామోహన్ సింగ్ ప్రకటిస్తారు. రాధామోహన్ సింగ్ ఈ ప్రకటన చేసే సమయానికి నరేంద్ర మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంటారు. అదే రోజు సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నడ్డా అభినందన సభ జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నడ్డాను 2019 జూన్‌లో కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ని2యమించిన రోజే ఆయన అమిత్ షా అనంతరం జాతీయ అధ్యక్ష పదవి చేపడతారని అనధికారికంగా చెప్పటం తెలిసిందే. వాస్తవానికి అమిత్ షా మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల అనంతరం పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటే ఆయన స్థానంలో నడ్డాను జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోవాల్సి ఉంది. కాగా పలు రాజకీయ కారణాలతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో కొంత జాప్యం జరగడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా ఆలస్యమైంది. బీజేపీ నియమావళి ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. ఇప్పుడు మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలో నుంచి 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసినందున జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను చేపడుతున్నట్లు రాధామోహన్ సింగ్ చెప్పటం గమనార్హం.
'చిత్రం... బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా