జాతీయ వార్తలు

సీఏఏకు వక్రభాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో విపక్షాలు పౌరసత్వ సవరణ చట్టానికి వక్రభాష్యం చెబుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మహేష్ కుమార్ శర్మ పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ దేశానికి పెద్ద శత్రువులు విపక్ష పార్టీల నేతలేనని చెప్పారు. భారతదేశ పొరుగునున్న మతతత్వ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ భారత్‌కు తరలివచ్చిన హిందూ కాందిశీకులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్ధేశించినదేనని, ఈ చట్టం వల్ల ఏ మతం వారికీ ఎలాంటి సమస్యలూ, ముప్పు లేదని చెప్పారు. భారతీయుల పౌరసత్వానికి ఈ చట్టం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఎవరి పౌరసత్వమూ రద్దుకాదని అన్నారు. దేశంలో ఉన్న 130 కోట్ల మంది భారతీయుల పౌరసత్వమూ సురక్షితమేనని చెప్పారు. విపక్షాలు ఎపుడూ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వ చట్టాన్ని సవరిస్తున్న వారంతా ఈ దేశానికి శత్రువులేనని వారి వల్ల దేశానికి నష్టమేనని వ్యాఖ్యానించారు. దేశ పురోభివృద్ధికి అడ్డుకట్టవేస్తున్నారని , సీఏఏ కొత్త చట్టమేమీ కాదని, గతంలో ఉన్నదేనని అన్నారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, మన్మోహన్‌సింగ్‌లు సైతం పొరుగుదేశాల నుండి తరలివచ్చిన కాందిశీకులకు పౌరసత్వం ఇవ్వాలని వాదించిన వారేనని అన్నారు. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ వంటి దేశాల నుండి తరలివచ్చి దశాబ్దాలుగా దేశంలో ఉంటున్నా వారికి పౌరసత్వం లేదని, వారికి పౌరసత్వం కల్పించే ధైర్యం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ సైతం పాల్గొన్నారు.
బీజేపీ బలాన్ని గ్రహించండి: కృష్ణసాగరరావు
అధికార పార్టీ ఇప్పటికీ బీజేపీ బలాన్ని గ్రహించడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి కే కృష్ణసాగరరావు పేర్కొన్నారు. బీజేపీపై అనవసరమైన వ్యాఖ్యలతో కేటీఆర్ గాలిపటాలను ఎగురవేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి హింసాత్మక, విధ్వంసకర మార్గాల ద్వారా వారు మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా చాలా మంది బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లను వేయకుండానే అడ్డుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బెదిరింపులకు దిగారని, చాలా మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేశారని అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని టీఎంసీ కంటే టీఆర్‌ఎస్ అధ్వన్నంగా మారిందని ఆరోపించారు. బీజేపీ తన సహజశక్తితో ఎన్నికల బరిలో దిగకుండా నిజాయితీలేని దుష్ట అజెండాతో కృత్రిమంగా ఎన్నికల్లో గెలవడానికి అన్ని మార్గాలనూ టీఆర్‌ఎస్ ఎంచుకుంటోందని అన్నారు. హింసాత్మకంగా , చట్టవిరుద్ధ వ్యూహాలతో ఎన్నికల్లో గెలవడం ప్రజల నిజమైన మద్దతును ప్రతిబింబించదని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అహంకారపూరిత, మూర్ఖపు ప్రకటనలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ బీజేపీని చూసి ఎందుకు అంత భయాందోళనకు గురవుతోందని ప్రశ్నించారు.
'చిత్రం... కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మహేష్ కుమార్ శర్మ