జాతీయ వార్తలు

ఉగ్రవాద మూలాలను పెకలించి వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పటం ద్వారా మాత్రమే ఉగ్రవాదాన్ని అదుపు చేయగలుగుతాం, ఇది చేయని పక్షంలో ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటుందని త్రిదళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. బిపిన్ రావత్ గురువారం రైసినా డైలాగ్ సదస్సులో మాట్లాడుతూ ‘9/11 తరువాత అమెరికా ఉగ్రవాదులకు కేంద్ర స్థానమైన ఒక దేశంపై దాడి చేసి బుద్ధి చెప్పింది, అమెరికా చేసిన విధంగానే ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలపై దాడి చేసి తుద ముట్టించాలి’ అని రావత్ ప్రతిపాదించారు. రావత్ పాకిస్తాన్ పేరెత్తకుండానే... ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది కాబట్టి దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి, దీని కోసం ప్రపంచ దేశాలు ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు ఉన్నంత కాలం ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు అర్థికంగా సహాయం చేస్తున్నాయి, ఆయుధాలు అందజేస్తున్నాయి, శిక్షణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి, ఈ సౌకర్యాలుండగా ఉగ్రవాదానికి ఎలా తెర పడుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులకు నిధులు అందజేయటంతోపాటు శిక్షణ ఇచ్చి ఆయుధాలను సమకూరుస్తున్న దేశాలను మొదట శిక్షించాలి, ఇది జరిగితేనే ఉగ్రవాదం అదుపులోకి వస్తుందని బిపిన్ రావత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు అమెరికా అవలంబించిన విధానమే సరైందని ఆయన ప్రకటించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులను తమ లక్ష్య సాధన కోసం వాడుకుంటున్నాయని బిపిన్ రావత్ ఆరోపించారు. ఉగ్రవాదంపై ప్రపంచ యుద్ధం జరగాలంటూ అప్పట్లో అమెరికా చేసిన ప్రకటనను ఉటంకిస్తూ అన్ని దేశాలు కలిసికట్టుగా పని చేస్తేనే ఉగ్రవాదం అదుపులోకి వస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయాలంటే మొదట ఉగ్రవాదులను ఏకాకులను చేయాలి, ఈ లక్ష్య సాధన కోసం ఉగ్రవాదులు తల దాచుకునేందుకు చోటిస్తున్న దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎవరు పెంచి పోషించినా వారిపై చర్య తీసుకోవాలి, ఆర్థిక సహాయం అందకుండా బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలను నిర్బంధానికి గురి చేసినప్పుడే ఉగ్రవాదం ఆగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఉగ్రవాదం మూలాలపై దాడి చేయాలి, మూలాలు పెకలించి వేయగలిగితేనే ఉగ్రవాదులను అదుపు చేయగలుగుతామన్నారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటం విజయం సాధిస్తుందని ఎవరైనా అనుకుంటే తప్పు చేసినట్లేనంటూ.. వారిని రక్షిస్తున్న వారిని తుద ముట్టించగలగాలన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారు ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు ఎలా అవుతారంటూ ఆయన పరోక్షంగా పాకిస్తాన్‌ను నిలదీశారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారు ఉగ్రవాదంపై జరుగుతున్న ప్రపంచ పోరాటంలో భాగస్వాములుగా ఉండటం హాస్యాస్పదమన్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను దౌత్యపరంగా ఏకాకులను చేయాలని బిపిన్ రావత్ డిమాండ్ చేశారు. ఉగ్రవాద సిద్దాంతాలను తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నదన్నారు. తాలిబాన్‌తో శాంతి చర్చలు జరపవచ్చు అనే ప్రశ్నకు బిపిన్ రావత్ బదులిస్తూ ఉగ్రవాదాన్ని వదులుకునేందుకు సిద్ధపడిన వారెవరితోనైనా శాంతి చర్చలు జరపవచ్చునని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషించటంతోపాటు వారి సేవలను ఉపయోగించుకుంటున్న దేశాలను గుర్తించటం అత్యంత ముఖ్యమన్నారు.
'చిత్రం...ఢిల్లీలో గురువారం జరిగిన రైసీనా డైలాగ్-2020లో మాట్లాడుతున్న త్రిదళాధిపతి బీపీన్ రావత్