జాతీయ వార్తలు

సత్య నాదెళ్లపై బీజేపీ ఎంపీ రుసరుస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: విద్యావంతులకు కూడా విజ్ఞానం కలిగించాల్సి వస్తోందంటూ బీజేపీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి లేఖి మైక్రో సాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్లపై ఘాటుగా దాడి చేశారు. సత్య నాదెళ్ల నిన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానించటం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల గురించి విద్యావంతులకు కూడా విజ్ఞానం కలిగించాల్సి వస్తోందనేందుకు సత్యానాదెళ్ల విమర్శలు ఒక ఉదాహరణ అని ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. మూడు ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లో మత హింసకు గురవుతున్న మైనారిటీ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్దులు, జైనులు, పార్సీలకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని విద్యావంతులు కూడా అర్థం చేసుకోలేకపోవడం విచిత్రంగా ఉన్నదని మీనాక్షి లేఖి విమర్శించారు. మైక్రోసాఫ్ట్ కేంద్ర కార్యాలయం ఉన్న అమెరికా కూడా సిరియన్ ముస్లింలకు అమెరికా పౌరసత్వం ఇవ్వకుండా కేవలం యజిదీలకు పౌరసత్వం ఇస్తోందని ఆమె సత్యానాదెండ్లను ఎత్తిపోడిచారు.