జాతీయ వార్తలు

ప్రధాని ‘పరీక్షా పే చర్చ’కు 2.6 లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇది ఎంతగా అంటే గత సంవత్సరం 1.4 లక్షల దరఖాస్తులు వస్తే ఈసారి ఏకంగా 2.6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఏటా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని గత రెండేళ్లుగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడతారు. దీనికి సంబంధించి ప్రధాని అడిగే ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుంచి ఐదు సబ్జెక్టులపై స్టోరీలను ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధి శాఖ ఎంపిక చేసింది. వీటిలో గ్రాటిట్యూడ్ ఈజ్ గ్రేట్, యువర ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యువర్ యాస్పిరేషన్స్, ఎగ్జామినింగ్ ఎగ్జామ్స్, అవర్ డ్యూటీస్, యువర్ టేక్, బేలన్స్ ఈజ్ బెనిఫీషియల్ అంశాలపై విద్యార్థులు కథనాలను పంపారు. వాస్తవానికి ఈనెల 16న విద్యార్థులతో పరీక్షా పే చర్చ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే, పండుగల కారణంగా ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈనెల 20న నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని యావత్ భారత దేశం దూరదర్శన్‌తో పాటు ఇతన చానళ్లు సైతం ప్రసారం చేస్తాయి. ఇదిలా ఉంటే మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని సుమారు 8.5 కోట్లకు పైగా ప్రజలు వీక్షిస్తారని మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.