జాతీయ వార్తలు

తెలుగుదేశంలోకి కిశోర్ చంద్రదేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ గిరిజన విభాగ చైర్మన్ కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే మంగళవారం ఇక్కడ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఢిల్లీ ఏపీ భవన్‌లో మాజీ కేంద్ర మంత్రి భేటీ అయ్యారు.బాబును కలిసిన తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ‘నేను టీడీపీలోకి వస్తానంటే చంద్రబాబు అంగీకరించారు. అమరావతిలో నేను టీడీపీలో చేరతాను’అని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటి చేస్తాననే విషయం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ప్రస్తావనకు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో 42 సంవత్సరాల పాటుగా పని చేసిన తాను ఇప్పుడు పార్టీని వీడడానికి అనేక కారణలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా బలహీనపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందని కిశోర్ చంద్రదేవ్ జోస్యం చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు. అరకు లోక్‌సభ నుంచి పోటీ పోటీ చేయమంటే చేస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ దెబ్బతినడానికి వైకాపా కారణమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్- టీడీపీ మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందాలు తనకు తెలియవని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సొంత నియోజక వర్గం అరకు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్టు తెలిసింది.