జాతీయ వార్తలు

పేదరిక నిర్మూలన.. మళ్లీ వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ దశాబ్దాలుగా హామీలు గుప్పిస్తూ ఏ రకమైన మెరుగుదలను పేదల జీవితాల్లో తీసుకురాలేని పార్టీకి మళ్లీ వారిని మభ్యపెట్టే హక్కు లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా పేదలకు వార్షికంగా 72వేల రూపాయలను అందిస్తామంటూ ఇచ్చిన హామీని బూటకమైనదిగా ఆయన అభివర్ణించారు. ఈ రకమైన తప్పుడు హామీలను ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్‌కు ఉందని పేర్కొన్న ఆయన 2008లో 72వేల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, కేవలం 52వేల రూపాయలనే మాఫీ చేశారని గుర్తు చేశారు. అయితే, ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త భారీగా ఈ మొత్తాన్ని దండుకున్నట్టుగా కాగ్ నివేదికలో తేలిందని ఆయన అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే దేశంలోని పేదలకు రాహుల్ ప్రకటించిన మొత్తం కంటే 1.5 రెట్ల మొత్తాన్ని ఎక్కువగా అందిస్తోందని అరుణ్ జైట్లీ గుర్తు చేశారు. ఇప్పటికే 75 వేల కోట్ల రూపాయల మేర ఎరువుల సబ్సిడీ ఇస్తున్నామని, ప్రజారోగ్యంపై 20వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే 70 నుంచి 80 శాతం మొత్తాన్ని మోదీ సర్కారు జమ చేస్తోందని, మిగతా మొత్తాన్ని ఇతర మార్గాల్లో అందిస్తోందని ఆయన అన్నారు.
ప్రజలకు పనేమీ ఉండదు: నీతి ఆయోగ్
కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఐదు కోట్ల కుటుంబాలకు ఏటా 72వేల రూపాయలను అందిస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు. దీనివల్ల ఎవరికీ పనిచేయాల్సిన అవసరం ఉండదని, అలాగే ఆర్థిక క్రమశిక్షణ కూడా అడుగంటిపోతుందని ఆయన విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలకు అరచేతిలో వైకుంఠం అన్నది కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీనేనని, ఇపుడు ఏటా 72వేల రూపాయలను అందించడం అన్నది కూడా ఇందులో భాగమేనని ఆయన అన్నారు. దీనివల్ల అనేక రకాలుగా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయని, ఎవరూ పనిచేయకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని రాజీవ్ కుమార్ అన్నారు. అయితే, ఈ పథకం అమలవుతుందా? లేదా? అన్నది అనుమానమేనన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతం, బడ్జెట్‌లో మూడు శాతం మొత్తాన్ని కనీస ఆదాయ పథకంగా కేటాయించడం వల్ల ప్రజల వాస్తవ అవసరాలు ఏమాత్రం తీరే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. 1971లో కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో పథకాన్ని చేపట్టిందని, 2008లో ఒకే ర్యాంకు కలిగినవారికి ఒకే పెన్షన్ అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చిందని, అలాగే 2013లో ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఆహార భద్రతను ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు. అయితే, వీటిలో ఏదీ అమలైన దాఖలాలు లేవని, ఇపుడు తాజాగా రాహుల్ ఇచ్చిన హామీ కూడా అదే కోవలో మిగిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.