జాతీయ వార్తలు

పేదరికాన్ని తరిమేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దూకుడుగా ప్రవేశించింది. పేదరికానికి చరమగీతం పాడే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ భారీ పథకానే్న ప్రకటించారు. పేదరికంలో మగ్గుతున్న 20 శాతం కుటుంబాలకు ఏటా రూ.72వేలను కనీస ఆదాయంగా సమకూరుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని చారిత్రకమైనదిగా అభివర్ణించిన ఆయన ‘ఇది మార్పు రావాల్సిన తరుణం. ఐదు కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిపొందుతాయి’ అని అన్నారు. ఈ పథకాన్ని ఆయన పేదరికాన్ని సమూలంగా నిర్మూలించేందుకు చేపట్టిన అంతిమ పోరుగా అభివర్ణించారు. దేశంలోని 25 శాతం నిరుపేద కుటుంబాలకు సాలీనా 72వేల నగదు చెల్లించడం వారి అభివృద్ధికి పాటుపడతామని రాహుల్ ప్రకటించారు. ఐదు కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.12వేల కనీస ఆదాయం హామీని కాంగ్రెస్ ప్రకటిస్తోందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ఈ పథకం వివరాలను వెల్లడిస్తూ దేశంలోని ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు సాలీనా రూ.72వేలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని సోమవారం ఏఐసీసీలో కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రకటించారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. ‘నా పథకం మీకు షాక్ ఇచ్చింది కదా.. మీరు ఆశ్చర్యపోతున్నారు కదా?’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు పదే పదే విలేఖరులను ఉద్దేశించి అన్నారు. ఇది చారిత్రాత్మిక పథకమని, దీనిద్వారా దేశం నుంచి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదట దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి తరువాత దశలవారీగా అమలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు రూ.3.50 ఆర్థిక సహాయం మాత్రమే చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ పథకం సాధ్యాసాధ్యాల గురించి లక్షలాది మందితో మాట్లాతామన్నారు. ఇప్పటికే ఆర్థిక నిపుణులతో చర్చించామని, పథకాన్ని అమలు చేయటం సాధ్యమేనని వారు సైతం అన్నారని రాహుల్ గాంధీ చెప్పారు. ‘ఈ పథకం మీ ఎన్నికల ప్రధాన ప్రచార సాధనమా?’ అని అడగ్గా.. దేశం నుంచి పేదరికాన్ని పారదోలడం కోసమే ఈ పథకాన్ని అమలు చేయాలనుకుంటున్నామని వివరణ ఇచ్చారు. 5కోట్ల కుటుంబాలు అంటే దాదాపు 25కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధిచేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక కుటుంబానికి ప్రతి నెలా 12వేల కంటే తక్కువ ఆదాయం వస్తుంటే, ఈ తక్కువ ఆదాయాన్ని తమ ప్రభుత్వం పూడుస్తుందని రాహుల్ ప్రకటించారు. ఒక కుటుంబం నెలసరి ఆదాయం రూ.6వేలైతే తమ ప్రభుత్వం మిగతా ఆరు వేలను ఆ కుటుంబం బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకానికి ఎన్ని వేల కోట్లు అవసరం అవుతాయనే ప్రశ్నకు రాహుల్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ‘ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన నిధులు మన దేశంలో ఉన్నాయి’ అని చెప్పారు.
దేశంలోని పేద ప్రజలు గత ఐదేళ్లుగా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. ఈ కష్టాలను పారదోలాలనే నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు వెల్లడించారు. కనీస ఆదాయం హామీ పథకం వివరాలను ప్రకటించటం తనకు ఆనందం కలిగిస్తోందని.. ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడ అమలు కావటం లేదని రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ధనికులకు డబ్బు ఇవ్వగలిగితే కాంగ్రెస్ పార్టీ దేశంలోని నిరుపేదలకు డబ్బు ఇవ్వగలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామనే హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకటించిన ఈ పథకం కూడా అమలుచేసి చూపిస్తామని రాహుల్ వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం ప్రైవేట్ విమానాలున్న వారికి కోట్లాది రూపాయలు ఇస్తుంటే, తాము నిరుపేద ప్రజలకు ఆర్థిక సహాయం చేయలేమా? అని కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు. ‘మన్రేగా అమలు చేసి చూపించాం. ఇప్పుడు దేశం నుంచి పేదరికాన్ని పారదోలే కనీస ఆదాయం హామీ పథకాన్ని అమలు చేసి చూపిస్తాం’ అని ఆయన చెప్పారు. ఇది అత్యంత పటిష్టమైన, ఫలపూర్వక పథకమని రాహుల్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ పథకాల వల్ల అనిల్ అంబానీ లాంటి ధనికుల సమాజం, పేద ప్రజల సమాజం ఏర్పడుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పేద ప్రజల తరపున పోరాడుందన్న రాహుల్ 21వ శతాబ్దంలో కూడా పేదరికం ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా మహాత్ముడు అయిపోవాలని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు ‘అలాంటిదేదీ లేదు. పేదలకు న్యాయం చేయాలన్నదే మా విధానం’ అని స్పష్టం చేశారు.