జాతీయ వార్తలు

గణాంక వాస్తవాలకు పాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో ఉపాధి అవకాశాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ఈ విషయంలో దారుణంగా విఫలం అయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ఉపాధి కల్పనా వైఫల్యాలు బయటపడకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉపాధి అంశాలకు సంబంధించిన గణంక వివరాలు వాస్తవాలు వెలుగు చూడకుండా మోదీ సర్కారు రాజకీయం చేయడం పట్ల ఇటు ఆర్థిక వేత్తలు, అటు సామాజిక శాస్తవ్రేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేయడం గమనార్హం. దేశంలోని గణంక సంస్థల సంస్థాగత స్వేచ్ఛను పరిరక్షించాలని అలాగే సమగ్రత విషయంలో ఎవరి జోక్యానికి ఆస్కారం ఉండకూడదంటూ 108 మంది ఆర్థిక వేత్తలు, సామాజిక శాస్తవ్రేత్తలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఉపాధి కల్పన పట్ల తన నేరపూరిత వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న మోదీ గణాంక సంస్థల పనితీరులోను జోక్యం చేసుకుంటున్నారని రాహుల్ అన్నారు. స్థూల జాతీయ ఉత్పత్తి వివరాలను మార్చడం, అలాగే ఉపాధి కల్పనా వివరాలను సైతం బయటపడకుండా తొక్కిపెట్టడం వంటి ఉదంతాలను రాహుల్ తన ట్విట్‌లో ప్రస్తావించారు.
ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా కూడా ఇదే అంశాలను పురస్కరించుకొని మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. భారతదేశ అంతర్జాతీయ ఖ్యాతిని, విశ్వసనీయతను మోదీ దెబ్బతీసినట్టుగా ఎవరూ నష్టపరచలేదని ఆయన వ్యాఖ్యానించారు. గణాంక వివరాలను తారుమారు చేసి తన గొప్పతనాన్ని చాటుకునేందు ప్రయత్నం చేస్తున్న బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని సుర్జేవాలా పిలుపునిచ్చారు.