జాతీయ వార్తలు

కాశ్మీర్‌కి విమానయానం ఫ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నుంచి బయటపడటానికి కేంద్రం వారికి ఉచిత విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రకటన చేసింది. ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాల నిమిత్తం కాశ్మీర్‌లో పనిచేస్తున్న పారా మిలటరీ దళాలు ఇక నుంచి సెలవుపై వెళ్లాలన్నా, విధి నిర్వహణలో జాయిన్ కావడానికి వెళ్లాలన్నా వారికి విమానాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వారు ఈ మొత్తాన్ని సంబంధిత శాఖల నుంచి రీయింబర్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సుల్లో పనిచేస్తున్న వారు ఢిల్లీ-శ్రీనగర్, శ్రీనగర్-్ఢల్లీ, జమ్మూ-శ్రీనగర్, శ్రీనగర్-జమ్మూ రూట్లలో ఉచితంగా విమాన ప్రయాణం చేయవచ్చు. విధుల్లో జాయిన్ కావడానికి, బదిలీపై వచ్చిన వారికి, టూర్‌పై, సెలవుపై వెళ్లే వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇన్‌స్పెక్టర్లు, ఆపై స్థాయి అధికారులకు మాత్రమే ఇప్పటివరకు ఈ సౌకర్యం ఉండేది. ప్రస్తుతం కాశ్మీర్‌లో 65వేల మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు(సీఆర్‌పీఎఫ్) సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అదనంగా బిఎస్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఐఎస్‌ఎఫ్ , నేషనల్ సెక్యూరిటీ గార్డులు సైతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల పుల్వామా జిల్లాలో సీఆర్‌పిఎఫ్ దళాలను వేరే ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాద దాడి జరిగిన 40 మంది జవాన్లు మృతి చెందారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉగ్రవాదుల దాడి హెచ్చరికలు ఉన్నప్పుడు వీరిని ప్రభుత్వం వాయుమార్గాన తరలించవచ్చు కదా.. రోడ్డు మార్గాన ఎందుకు తరలించి వీరి ప్రాణాలను బలిగొన్నారు.. వారిని విమానాల్లో తరలించడం వృథా ఖర్చని ప్రభుత్వం భావించిందా? అంటూ కేంద్రం పై పలు విమర్శలు వెల్లువెత్తాయి. దాని నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం వారికి విమానాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు. ఇకపై జవాన్లు, సబ్-ఆఫీసర్లు వంటి వారు కమర్షియల్ విమానాల్లో టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణించి, తర్వాత ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేసుకోవచ్చునని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌కొరియర్ సర్వీసెస్ సౌకర్యానికి ఇది అదనమని ఆయన చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఈ రాయితీ వల్ల సుమారు 7.8 లక్షల మంది కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో ఉన్న పారామిలటరీ దళాల సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికార ట్విటర్ వెల్లడించింది.