జాతీయ వార్తలు

మేఘాలయ గవర్నర్‌ను తప్పించండి: సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్‌ను బహిష్కరించాలన్న మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్‌ను తక్షణం పదవి నుంచి తప్పించాలని సీపీఎం గురువారం డిమాండ్ చేసింది. ఉన్నత పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పార్టీ పొలిట్ బ్యూరో విమర్శించింది. రాయ్ ప్రకటన యువత, విద్యార్థులను రెచ్చగొట్టేదిగా ఉందని పార్టీ ధ్వజమెత్తింది.‘గవర్నర్ పదవి రాజ్యాంగ బద్ధమైంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే రాష్టప్రతి ఆ పదవిలో నియమిస్తారు. అలాంటిది తథాగతరాయ్ బాధ్యతాహిత్యంగా వ్యవహరించడం దుర్మార్గం’ అని సీపీఎం దుయ్యబట్టింది. ఇలాంటి ప్రకటనలు చేయడం రాయ్‌కు ఇదే కొత్తకాదని, గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పార్టీ గుర్తుచేసింది. కాశ్మీర్, కాశ్మీర్ ఉత్పత్తులను బహిష్కరించాలని చాంధసవాదుల పిలుపునకు మద్దతు ఇస్తూ తథాగతరాయ్ మంగళవారం ట్వీట్ చేశారు. కాశ్మీర్ లేదా అమర్‌నాథ్ యాత్రకు రెండేళ్లపాటు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. అలాగే కాశ్మీరీ ఉత్పత్తులను వాడవద్దని, ఆ వ్యాపారులను ప్రోత్సహించవద్దని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ట్వీట్ చేసిన గవర్నర్‌ను తక్షణం తప్పించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో రాష్టప్రతిని కోరింది.