జాతీయ వార్తలు

సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆలిండియా గవర్నమెంట్ ఎంప్లారుూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోలు, తెలంగాణ ఎన్జీవోలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సాంఘిక భద్రతగా ఉపయోగపడుతున్న పెన్షన్ విధానాన్ని కేంద్ర రద్దు చేసిందని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు ఏకే పద్మనాభన్ మాట్లాడుతూ గతంలో 19 రోజులపాటు ఢిల్లీ వేదికగా ఉద్యోగుల హక్కుల కోసం నిరసనలు చేసినా ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోలేదని అన్నారు. ఏన్డీయే ప్రభుత్వం ఉద్యోగుల సాంఘిక భద్రతకు వ్యితిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆరు ప్రధాన డిమాండ్ల్‌ను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ మూడు నెలల జీతాన్ని ఆదాయ పన్ను రూపంలో చెల్లిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం కార్యాలయాలు, కేంద్ర ఫ్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానానికి స్వస్తిచెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్జీవోల అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర తీసుకొచ్చిన పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉద్యోగులు పక్షాన నిలిచే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.