జాతీయ వార్తలు

నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: తెలంగాణలోని రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని టీఆర్‌ఎస్ సభ్యుడు బీ వినోద్‌కుమార్ మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారిపై భారీ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, విస్తరిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే రాజీవ్ రహదారిని ఎన్‌హెచ్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని అన్నారు.