జాతీయ వార్తలు

శబరిమలలో ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఫిబ్రవరి 11: శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ పరిసరాల్లో మరోసారి ఉత్కంఠ పూరిత వాతావరణ నెలకొంది. నెలవారీ పూజల నిమిత్తం మంగళవారం ఆలయం తెరుచుకోనుంది. వార్షిక పూజల నిమిత్తం ఇటీవల శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు, నిరసనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొందరు మహిళలు అయప్ప ఆలయ ప్రవేశం చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇప్పుడు నెలవారీ పూజల నిమిత్తం ఆలయం తెరుచుకోనున్నందున పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మళయాల మాసం ‘కుంబం’ సందర్భంగా ఈనెల 17 వరకూ అయ్యప్ప ఆలయాన్ని తెరిచి ఉంచుతారని అధికారులు సోమవారం వెల్లడించారు. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. కలభాభిషేకం, సహస్రకలషం, లక్షార్చనా పేరిట ఈ ఐదు రోజులూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి వాసుదేవన్ నంపూత్రి మంళవారం సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుస్తారని అధికారులు వెల్లడించారు. తంత్రి కందరారు రాజీవారు హాజరవుతారు. ప్రత్యేక పూజల్లోనూ ఆయన పాల్గొంటారు. దీంతో శబరిమల పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మహిళలు ఆలయ ప్రవేశం చేసే అవకాశం ఉండడంతో సంఘ్ పరివార్ సహా హిందూ సంస్థలు నిరసనలు దిగే అవకాశం ఉందని బందోబస్తు మరింత పెంచారు. శబరిమల చుట్టూ అలాగే నిలక్కల్ నుంచి ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.