జాతీయ వార్తలు

లోయలో పడిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మే 5: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఆ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా దల్దోవా ఘాట్‌లో బైకును తప్పించబోయి మహేంద్ర ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా 14 మంది సంఘటన స్థలంలోనే చనిపోయారు. 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నిశిరాత్రివేళ అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల్లో బలరాంపూర్, అంబికాపూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. రాయ్‌పూర్‌లోని గడ్వా నుంచి అంబికాపూర్‌కు బస్సు బయలుదేరింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బస్సు దల్దోవా ఘాట్‌లో వెళ్తుండగా వేగంగా వచ్చిన బైకును తప్పించబోయి అదుపు తప్పింది. ఘాట్‌లో వంతెన ఇరుకుగా ఉండటంతో అదుపుతప్పిన బస్సు మూడుసార్లు పల్టీ కొట్టింది. సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ అవినాష్ శరణ్ హుటాహుటిన బయలుదేరారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం రమణ్‌సింగ్ గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సలు అందించేందుకు రాయ్‌పూర్‌కు తరలించాలని ఆదేశించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రును పరామర్శించారు.