జాతీయ వార్తలు

మోదీ బిఏ డిగ్రీ చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: ప్రధాని నరేంద్ర మోదీ బిఏ డిగ్రీ వివరాలను వెల్లడించి, వాటిని వెబ్‌సైట్‌లో ఉంచాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈమేరకు ఢిల్లీ యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ యోగేశ్ త్యాగీకి ఆయనొక లేఖ రాశారు. ప్రధాని విద్యార్హతలు దేశ ప్రజలందరికీ తెలియాల్సి ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ వర్శిటీ విసికి రాసిన లేఖలో‘ ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన ధృవపత్రాలు అన్నీ వెబ్‌సెట్‌లో పెట్టడమే కాకుండా భద్రంగా ఉంచాలి’అని పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో తాను బిఏ చదివినట్టు మోదీ పేర్కొన్న విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత గుర్తుచేశారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేసినట్టు మోదీ అఫిడవిట్‌లో తెలిపారు. ‘దేశ ప్రజలకు తమ ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు ఉంది’ అని కేజ్రీవాల్ అన్నారు. అసలు మోదీ డిగ్రీనే చదవలేదని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ బుధవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. మోదీ డిగ్రీ చదవినట్టు యూనివర్శిటీ రికార్డుల్లో ఎక్కడా లేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో తాను డిగ్రీ, పీజీ కూడా చేసినట్టు మోదీ పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న దాని ప్రకారం 1978లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో దూరవిద్య ద్వారా డిగ్రీలు పూర్తిచేసినట్టు ఉంది. అయితే మోదీ బిఏ డిగ్రీనే చేయకుండా ఎంఏ ఎలా పూర్తిచేస్తారని ఢిల్లీ యూనివర్శిటీ విసికి రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు. పైగా మోదీ గుజరాత్ యూనివర్శిటీ నుంచి ఎంఏ చేశారని చెబుతున్నారన్న కేజ్రీవాల్ బిఏ చదవకుండా ఎంఏ డిగ్రీ ఎలా సాధ్యమని నిలదీశారు. ప్రధాని మోదీ డిగ్రీపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. మోదీ డిగ్రీ వివరాలు ఇవ్వమని అడుగుతుంటే ఢిల్లీ యూనివర్శిటీ నిరాకరిస్తోందని ఆప్ చీఫ్ బుధవారం ఆరోపించారు. పిఎంవోను ఆశ్రయించాలని చెప్పడం విడ్డూరంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. కాగా మోదీ విద్యార్హతలపై ఆర్‌టిఐ కింద దరఖాస్తు చేసుకోగా కేంద్ర సమాచార కమిషన్ ఢిల్లీ, గుజరాత్ యూనివర్శిటీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మోదీ డిగ్రీల వివరాలు వెల్లడించాల్సిందిగా సిఐసి తన ఆదేశాల్లో పేర్కొంది.