జాతీయ వార్తలు

ఒప్పందాన్ని ఎందుకు మార్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రన్నీ (కేరళ), మే 5: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం విషయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీపై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. ఎవరి ఆదేశం మేరకు హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మార్పులు చేశారో, హెలికాప్టర్ క్షేత్ర స్థాయి పరీక్షలను విదేశాలకు ఎందుకు మార్చారో వెల్లడించాలని ఆయన ఆంటోనీని డిమాండ్ చేశారు. ఆంటోనీ స్వంత రాష్ట్రం కేరళలో ఈ నెల 16న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఆయనపై అమిత్ షా ధ్వజమెత్తారు. పతనంతిట్ట జిల్లాలోని రన్నీ నియోజకవర్గంలో బిజెపి నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సిపిఎంతో బిజెపి రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆంటోనీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు చేసిన ఆంటోనీపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌ను, సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ను అరేబియా సముద్రంలో పడేయాలనేదే బిజెపికున్న ఏకైక బహిరంగ అజెండా అని ఆయన స్పష్టం చేశారు. కేరళలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే మత ఘర్షణలు చోటు చేసుకుంటాయన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. తమ పార్టీ 14 రాష్ట్రాలను పాలించిందని, వాటిలో ఏ ఒక్కదానిలోనూ మత ఘర్షణలు జరుగలేదని అమిత్ షా అన్నారు. ‘అందరికీ సమాన న్యాయం, రక్షణ ఉండాలనేదే మా ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేకసార్లు చెప్పారు. బిజెపి అన్ని రాష్ట్రాల్లోనూ దీనినే అవలంబిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్‌ల వరుస పాలనల్లో రాష్ట్రంలోని అనేక వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే ఈ అన్యాయాలను సరిదిద్దుతామని ఆయన అన్నారు.