జాతీయ వార్తలు

బీజేపీ కార్యక్రమంలో సంజయ్‌దత్.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 2: 1993 ముంబయి సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించి, ఇటీవలే జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అకస్మాత్తుగా ఆదివారం మహారాష్టల్రో ఓ బీజేపీ కార్యక్రమంలో ప్రత్యక్షం కావటంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ జాతి విద్రోహ లక్షణానికి ఇది మంచి ఉదాహరణ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇది బీజేపీకి కొత్త కాదని ఆ పార్టీ నేత నిజాముద్దీన్ రరుూన్ అన్నారు. బీజేపీ యువ విభాగానికి చెందిన నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దత్ పాల్గొన్నారు. యువ నాయకుడు మోహిత్ కాంబోజ్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని స్థానికులకు దత్ విజ్ఞప్తి చేశారు. ‘వాళ్లు నిజంగా మహారాష్టన్రు ప్రేమించే వాళ్లయితే దత్‌ను పిలిచేవాళ్లు కారు’ అని శివసేన విమర్శించింది. దత్ తండ్రి సునిల్‌దత్, సోదరి ప్రియాదత్‌లు మొదట్నుం చి కాంగ్రెస్‌లో ఉండి ఆ పార్టీ టికెట్లపై ఎంపీలుగా గెలిచిన సంగతి తెలిసిందే. అలాంటి విశ్వసనీయతను దత్ దెబ్బ తీశారని ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు.