జాతీయ వార్తలు

మా నుంచి జాప్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, మే 2: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి విధానపరమైన జాప్యం జరగలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం స్పష్టం చేశారు. న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉందని ఆయన చెప్పారు. న్యాయస్థానాల్లో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన కేసులపై ఇటీవల భావోద్వేగానికి గురయి కంటతడి పెట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో, న్యాయ శాఖ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకాలు కొలీజియం వ్యవస్థ ద్వారానే సాగుతున్నాయి. హైకోర్టుకు హైకోర్టు కొలీజియం ఉంది. వారు ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు సిఫారసు చేస్తారు. తరువాత సుప్రీంకోర్టు కేవలం ప్రక్రియ చేపట్టడానికే ఈ అంశాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేస్తుంది’ అని సదానంద గౌడ వివరించారు. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను 21వేల నుంచి 40వేలకు పెంచడంలో పట్టనట్టుగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధ్వజమెత్తడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సదానంద గౌడ ఈ విషయం చెప్పారు. ‘నా కార్యాలయంలో (న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన) ఫైళ్లను 15 రోజులకు మించి పెట్టుకోలేదు’ అని న్యాయ శాఖ మంత్రి ఎర్నాకులం ప్రెస్‌క్లబ్ ఇక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో చెప్పారు. ‘న్యాయ వ్యవస్థ గురించి నేను ఎలాంటి వ్యాఖ్య చేయదలచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఫైలు విషయంలో కూడా జాప్యం చేయలేదు’ అని సదానంద గౌడ అన్నారు. పార్లమెంటు ఏకగీవ్రంగా నేషనల్ జుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ బిల్లును ఆమోదించినప్పటికీ, దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని సదానంద గౌడ గుర్తుచేశారు. నూటికి నూరు శాతం మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మద్దతిచ్చిన ఈ బిల్లు సుప్రీంకోర్టు తిరస్కరణకు గురయిందని ఆయన పేర్కొన్నారు.