జాతీయ వార్తలు

వచ్చే 30ఏళ్లు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: దేశ పురోభివృద్ధికి రానున్న 30 సంవత్సరాలు చాలా కీలకమని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2055 నాటికి దేశ జనాభాలో అధిక శాతం మందిలో పనిచేసే సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం యువతలో నైపుణ్యం పెంపొందించాల్సిన అవసరం చాలా ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశ జనాభా అనేక సవాళ్లను సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువతలో నైపుణ్యం పెరగాలని పేర్కొన్నారు. సెంట్రల్ గుజరాత్‌లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఆదివారం యువతను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ‘దేశ జనాభాలోని 65 శాతం మందికి పైగా ప్రజలు 35 ఏళ్ల లోపు వయస్సు వారే.. 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని వీరిలో నైపుణ్యం పెరిగే విధంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని వెంకయ్య పిలుపునిచ్చారు. ‘ఒక ఉప రాష్ట్రపతిగా అనేక దేశాల్లో పర్యటించా.. భారత సామర్థ్యంపై అన్ని దేశాలూ సదభిప్రాయంతో ఉన్నట్లు గమనించాను.. దీనిని వమ్ము చేయకుండా యువత అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ దేశాన్ని పురోగమనం దిశగా నడిపించాలని కోరుకొంటున్నా’అని వెంకయ్య పేర్కొన్నారు. కుల, మత, వర్గ విభేదాలు, నేరతత్వాలకు ఆస్కారం లేకుండా సంస్కృతి, సామర్థ్యం మరింత బలపడే దిశగా దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత యువతపైనే ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కాగా, సర్దార్ వల్లభాయిపటేల్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి వెంకయ్యనాయుడు ఘనంగా నివాళులు అర్పించారు.
*చిత్రం... ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు