జాతీయ వార్తలు

అధికారం కావాలా...సావర్కర్ కావాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: మహారాష్టల్రో అధికారం ముఖ్యమో, దేశానికి స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర సావర్కర్ ముఖ్యమో శివసేన తేల్చుకోవాలని బీజేపీ అల్టిమేటమ్ ఇచ్చింది. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీర సావర్కర్‌ను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. వీర సావర్కర్‌కు రాహుల్ గాంధీకి అసలు పోలికే లేదని, పోల్చలేమని అన్నారు. ‘గాంధీ’ పదాన్ని రాహుల్ అరువు తెచ్చుకున్నారని ఆయన విమర్శించారు. వీర సావర్కర్‌నుద్ధేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దేశానికి ఆదర్శప్రాయుడు, దేశ భక్తుడైన వీర సావర్కర్‌నుద్ధేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో థాక్రే అధికారం ముఖ్యమని భావిస్తారా? లేక వీర సావర్కర్ ముఖ్యమని భావిస్తారా? తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన భారత్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ వీర సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. ఆ విమర్శలను ఉపసంహరించుకోవాలని తాము డిమాండ్ చేసినా రాహుల్ పట్టించుకోలేదన్నారు. పైగా తాను ఆ వ్యాఖ్యలను ఉపసంహరించకోనని రాహుల్ ఖండితంగా చెప్పారని ఆయన తెలిపారు. రాహుల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాఉండగా రాహుల్ వ్యాఖ్యల పట్ల శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే దేశ ప్రజలు కాంగ్రెస్‌ను రెండోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని రౌత్ అన్నారు. కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించారు.