జాతీయ వార్తలు

క్షమాపణ ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ‘ఇది మేక్ ఇన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియా’అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. మరణిస్తాను కానీ క్షమాపణలు కోరే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. రాహుల్ గాంధీ శనివారం రాంలీలా మైదానంలో పార్టీ ఏర్పాటు చేసిన భారత్ బచావో ర్యాలీ (్భరత్‌ను రక్షించండి) ర్యాలీలో ప్రారంభోపన్యాసం ఇస్తూ ‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో నేను చెప్పింది అక్షరాలా నిజం. నిజం మాట్లాడినందుకు క్షమాణలు చెప్పాలా?’అని ర్యాలీకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ప్రశ్నించారు. ‘నేను రాహుల్ సావర్కర్‌ను కాదు, రాహుల్ గాంధీని. నిజం చెప్పేందుకు ఎంత మాత్రం వెనకాడను’ అని ఆయన ప్రకటించారు. రేప్ ఇన్ ఇండియా అనే వ్యాఖ్యానం ఎందుకు చేయవలసి వచ్చిందంటూ ఆయన ఒక వివరణ ప్రజలు ముందు పెట్టారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నిత్యం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతుంటారు. వార్తాపత్రికను విప్పితే మేక్ ఇన్ ఇండియా
గురించి పత్రికల్లో వార్తలు ఉంటాయనుకుంటారు. అయితే దీనికి విరుద్ధంగా పత్రికల్లో రేప్‌ల వార్తలే అధికంగా కనిపిస్తాయి. అందుకే ఇది మేక్ ఇన్ ఇండియానా? లేక రేప్ ఇన్ ఇండియానా? అని ప్రశ్నించాల్సి వచ్చింది’అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా రేప్ ఇన్ ఇండియాగా మారిందని రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును స్తంభింపజేయటం తెలిసిందే. రేప్ ఇన్ ఇండియా అంటూ విమర్శలు కురిపించిన రాహుల్ దేశంలోని మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు ముఖ్యంగా మహిళా పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అన్నారు. తాను చెప్పింది అక్షరాలా నిజం, నిజం మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పటం ఏమిటని ఆయన ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నిజం మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ పలుమార్లు స్పష్టం చేశారు. నిజం మాట్లాడినందుకు తానెప్పుడు క్షమాపణలు చెప్పలేదు, ఇక మీదట కూడా చెప్పబోనని ఆయన పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినందుకు ప్రదాని నరేంద్ర మోదీ, ఆయన సహాయకుడు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తొమ్మిది శాతం జీడీపీ సాధించిన దేశం ఇప్పుడు ఎక్కడుందని ఆయన నిలదీశారు. ఉల్లిపాయల ధరలు కిలో 200 రూపాయలైతే ఇక సామాన్య జనం ఎలా జీవిస్తారని ఆయన ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మోదీ కలిగించిన నష్టం ఇంకా పూడ్చుకోలేదన్నారు. మోదీ ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయలను అదానీ, అంబానీలకు ఇచ్చారని ఆయన మరోసారి ఆరోపించారు. ‘మన శతృవులు దేశం ఆర్థిక వ్యవస్థను కూప్పకూల్చాలనుకున్నారు. అయితే అది వారు చేయలేదు. నరేంద్ర మోదీ దేశం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారు’అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అదానీకి మోదీ లక్షల కోట్లు విలువ చేసే యాభై కాంట్రాక్టులు ఇచ్చారని, ఇది చోరీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోదీ అధికారం కోసం ఏమైనా చేస్తారని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
*చిత్రం... ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ