జాతీయ వార్తలు

ఈశాన్య రాష్ట్రాలకు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. పౌరసత్వ బిల్లును ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో బుధవారం కేంద్రం ఈ సవరణ బిల్లును ఆమోదం కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తొలిసారిగా ముఖ్యమైన పౌరసత్వ బిల్లుపై ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడం ద్వారా మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు రక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర ప్రజలకు పౌరసత్వ బిల్లు వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ సవరణ బిల్లును ప్రతిపాదించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ పౌరసత్వ సవరణ బిల్లు యొక్క ఉద్దేశ్యాలు, లక్ష్యాలను అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు. ఇలాఉండగా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య భారతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అస్సాంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న ప్ల-కార్డులను చేతబట్టుకుని వారు రోడ్లపైకి వచ్చారు.
సచివాలయం సమీపంలో పోలీసులు వారిని అడ్డగించడంతో విద్యార్థులకు-పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సుమారు 500 మంది విద్యార్థులు మరో మార్గం ద్వారా సచివాలయానికి దూసుకుని వచ్చేయడంతో పోలీసులు లాఠీలు ఝుళిపిస్తూ వారిని చెదరగొట్టరు. జీఎస్ రోడ్డులోని పోలీసు బ్యారికేడ్లను పడగొట్టి ముందుకు దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. విద్యార్థి సంఘాలు, వివిధ సంఘాల నాయకుల అధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్ ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి.
*చిత్రం... కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు