జాతీయ వార్తలు

ఇన్ఫోసిస్‌కు ఐరాస పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 11: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను విశిష్ట ‘ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ పురస్కారం’ వరించింది. స్పెయిన్ దేశంలోని మేడ్రిడ్ నగరంలో ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ‘వాతావరణ మార్పులు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ‘ప్రస్తుత వాతావరణ సహజత్వం’ (క్లైమేట్ నేచురల్ నౌ) కేటగిరీ నుంచి తమ సంస్థకు ఈ అవార్డు లభించిందని బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ కార్పొరేట్ కంపెనీగా బెంగళూరు కేంద్ర కార్యాలయంగా నడిచే ఈ సంస్థ నిలవడం విశేషం. వాతావరణ మార్పులను నియంత్రించి పనితీరులో చక్కటి ప్రతిభను కనబరిచే కంపెనీలను ఎంపికచేసి ఐక్యరాజ్య సమితి ఈ విశిష్ట అవార్డును ప్రదానం చేస్తుంది. కాగా తమ కంపెనీ నిర్వహిస్తున్న ‘కార్బన్ నేచురల్’ కార్యక్రమానికిగాను ఐరాస ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ విషయంలో సరైన పరిమితి (కొలతలతో) కూడిన, పరిశోధనాత్మక, ప్రయోగాత్మక చర్యలను తమ కంపెనీ చేపడుతోందని తెలిపింది. ఇందువల్ల తమ ఇతర కార్యక్రమాల లక్ష్య సాధనలో సైతం స్థిరత్వం చోటుచేసుకుంటోందని, ప్రత్యేకించి లింగ వివక్ష రాహిత్యం, ఆరోగ్యం, చక్కటి జీవనం, ఆర్థికాభివృద్ధి అవకాశాలు ఇందులో ఇమిడివున్నాయని వివరించింది. ఇలావుండగా ‘ఇన్ఫోసిస్ చేపడుతున్న కార్బన్ నేచురల్ కార్యక్రమం స్పూర్తిదాయకంగా ఉంద’ని ఐక్య రాజ్య సమితి గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ ప్రోగ్రాం మేనేజర్ నికోలస్ స్వెన్నింగ్‌సన్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. కార్బన్ నేచురల్లీ కార్యక్రమం కోసం తొలిసారిగా ఇన్ఫోసిస్ ఓ ప్రయోగాత్మక నమూనాను వాతావరణ చర్యలకోసం ఏర్పాటు చేయడం విశేషమని, ఇందుకోసం ఆ కంపెనీ లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తోందని తెలిపారు.