జాతీయ వార్తలు

రూ. 2,000 నోటు రద్దు చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెండువేల రూపాయల నోటు రద్దు చేస్తున్నట్టు వస్తున్న కథనాలను కేంద్రం తోసిపుచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం రాజ్యసభలో ఆ వార్తలను కొట్టిపారేశారు. ‘రూ. 2000 నోటు రద్దు కాదు. దీనిపై ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు’అని ఆయన భరోసా ఇచ్చారు. రెండువేల రూపాయల నోటు రద్దవుతుందన్న కథనాలు వెల్లువెత్తుతున్నట్టు తెలిసిందని, అయితే ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇప్పుడే కాదు, ముమ్నుందు కూడా 2000 రూపాయల నోటు ఉప సంహరించుకోవాలన్న ప్రతిపాదన ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ మాట్లాడుతూ ‘రెండు వేల రూపాయల నోటు ప్రవేశపెట్టిన తరువాత నల్లధనం పెరిగిపోయింది. వెయ్యి రూపాయల నోటు రద్దు చేసి దాని స్థానంలో కేంద్రం 2000 నోటు తీసుకొచ్చి తప్పుచేసింది’అని అన్నారు. 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దుచేసిందని మంత్రి ఠాగూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘500, 1000 రూపాయల నోట్ల వల్ల నల్లధనం పెరిగిపోయింది. అలాగే మన కరెన్సీకి నకిలీ వెల్లువెత్తింది. దేశంలో ఆర్థిక టెర్రరిజం జడలు విప్పింది. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదులకు అక్రమ మార్గాల ద్వారా ఆర్థిక సహకారం అందేది. వీటన్నింటికి చెక్‌పెట్టడానికే డిమోనిటైజేషన్ తీసుకొచ్చాం’అని మంత్రి వివరణ ఇచ్చారు. డిజిటల్ చెల్లింపులు వల్ల పరిస్థితి చక్కబడిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. 2016 నవంబర్ 4న రూ. 17,741.87 బిలియన్ల నోట్లు చలామణిలో ఉండేవన్నారు. 2019 డిసెంబర్ 2 నాటికి రూ. 22,356.48 బిలియన్లకు చలామణి పెంచినట్టు ఆయన స్పష్టం చేశారు. నోట్స్ ఇన్ సర్క్యులేషన్(ఎన్‌ఐసీ) ఏటా సగటున 14.51 శాతం పెరుగుతుండేదని, అక్టోబర్ 2014 నుంచి అక్టోబర్ 2016 వరకూ గణాంకాలు సభకు తెలిపారు. డిమోనిటైజేషన్ తరువాత డిజిటల్ చెల్లింపులు రావడంతో కరెన్సీ వినియోగం తగ్గుతూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు ఏటేటా పెరుగుతూ వచ్చాయని,ఇది మంచి పరిణామమని ఠాకూర్ వివరించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీల విలువ 2071గా ఉండగా, 2018-19లో 3134కు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
*చిత్రం.... కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్