జాతీయ వార్తలు

ఇది ప్రమాదకర పరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తాజాగా చేపట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా మత స్వేచ్ఛ రక్షణ కమిషన్ తీవ్ర విమర్శలు చేసింది. భారత పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించే పక్షంలో ఆ దేశ హోం మంత్రి అమిత్ షా, ఇతర కీలక నేతలపై ఆంక్షలు విధించాలని కూడా కోరింది. ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వాన్ని కల్పించేందుకే భారత్ ఈ బిల్లును తెచ్చిందని ఈ కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించే సరికొత్త బాటకు కూడా ఈ బిల్లు ద్వారా భారత్ తెరతీసిందని ఈ సంస్థ పేర్కొంది. తప్పుడు మార్గంలో తీసుకున్న ప్రమాదకరమైన మలుపుగా దీనిని అభివర్ణించింది. భారత రాజ్యాంగం, లౌకిక భావనలకు ఈ బిల్లు పూర్తి వ్యతిరేకంగా ఉందని తెలిపింది. మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా చట్టం ముందుకు అందరూ సమానమేనని, భారత రాజ్యాంగ స్ఫూర్తికి కూడా ఇది విరుద్ధమని తెలిపింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఈ అమెరికా ఫెడరల్ కమిషన్ 1998లో ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా ఏఏ దేశాల్లో మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయో పరిశీలించి తన నివేదికను అమెరికా అధ్యక్షుడికి అందిస్తుంది. 2002లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై దాఖలైన కేసుల నేపథ్యంలో ఆయన వీసాను రద్దు చేయాలని అప్పటి అమెరికా ప్రభుత్వానికి ఈ కమిషనే సిఫారసు చేసిన విషయం గమనార్హం. భారత లోక్‌సభ ఈ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించడం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనికి పార్లమెంటు ఆమోదం లభించే పక్షంలో అమిత్ షాతోపాటు ఇతర సూత్రధారులపై ఆంక్షలు విధించాలని తెలిపింది.