జాతీయ వార్తలు

ఎన్డీఏకి మద్దతిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు తదితర ఆరు మతాల వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లుకు శివసేన రాజ్యసభలో కూడా బలపరిస్తే మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహించుకుంటామని కాంగ్రెస్ అధినాయకత్వం శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను హెచ్చరించినట్లు తెలిసింది. ఎన్డీఏ నుంచి వెలుపలికి వచ్చి మూడు పార్టీల కూటమిలో చేరి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివసేన ఇప్పుడు లోకసభలో ఎన్డీఏకు మద్దతు ఇవ్వటం ఏమిటని కాంగ్రెస్, ఎన్‌సీపి అధినాయకులు మంగళవారం మండిపడుతున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై సోమవారం అర్థరాత్రి లోక్‌సభలో జరిగిన ఓటింగ్ సందర్భంగా శివసేన బిల్లు (ఎన్డీఏ)కు అనుకూలంగా ఓటు వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఎన్‌సీపీ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మిత్ర పక్షమైన శివసేన బిల్లుకు అనుకూలంగా ఓటు వేయటం కాంగ్రెస్, ఎన్‌సీపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. రాజ్యసభలోనూ ఈ బిల్లుకు శివసేన బలపరిస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ సంకేతాలు పంపించింది. ఇలాఉండగా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చామని శివసేన సీనియర్ నాయకుడు అరవింద్ సావంత్ ప్రకటించటం కూడా కాంగ్రెస్, ఎన్‌సీపీ నాయకులకు మింగుడు పడటం లేదు. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ మధ్య ఏర్పడిన కనీస ఉమ్మడి కార్యక్రమం మహారాష్టక్రే పరిమితమని అరవింద్ సావంత్ ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్లు అయ్యిందనీ, అందుకే మహారాష్టల్రో శివసేన నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడంపై పునరాలోచించాలని రాహుల్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగంపై షరాఘాతం వంటిది, దీనిని సమర్థించే వారు రాజ్యాంగంపై దాడి చేయటంతోపాటు దేశం పునాదులను నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లేనని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించటంతో పాటు శివసేన లాంటి పార్టీలకు స్పష్టమైన సందేశం పంపించేందుకే ఈ ట్వీట్ చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. శివసేన గత రాత్రి పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వటంతో కంగుతిన్న కాంగ్రెస్, ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించాలా? వద్దా? అనే ఆలోచనలో పడిపోయారు. రాహుల్ ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్‌తో శివసేన వ్యవహారం గురించి సంప్రదించడంతో పాటు పార్టీ సీనియ ర్ నాయకులతో సమావేశమై తదుపరి చర్యల గురించి చర్చ లు జరిపారు. శివసేన లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతిచ్చే పక్షంలో మహారాష్టల్రో శివసేన నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని రాహుల్ పార్టీ నాయకులను ఆదేశించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, ఎన్‌సీపీలు పౌరసత్వ సవరణ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తుంటే శివసేన సమర్థించడం ఏమి టి? దీనిని తామెందుకు సహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రశ్నించింది. కాంగ్రెస్ అధినాయకత్వం వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఏకీభవించినట్లు తెలిసింది. మన మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వటం ఏ విధంగా సమర్థనీయమని శరద్ పవార్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు.