జాతీయ వార్తలు

ఉప పోరు తరువాత మంత్రి వర్గ విస్తరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 4: రాష్ట్రంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పూర్తయిన తరువాత కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ అంశాన్ని ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాదీ బుధవారం ఇక్కడ వెల్లడించారు. కేబినెట్ విస్తరణకు బీజేపీ అధినాయకత్వం ఆమోదమే తరువాయి, తరువాత విస్తరణ జరిగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘కేబినెట్‌లోని ఎవర్ని తీసుకోవాలి, ఎవర్ని కొనసాగించాలి అన్న నిర్ణయం తీసుకునే అధికారం సీఎందే. అయితే హైకమాండ్ సలహాలు తీసుకుంటారు’అని ఆయన చెప్పారు. బీజేపీ సీనియర్ సభ్యులు ఉమేష్ కత్తి, బసనాగౌడ పాటిల్‌కు విస్తరణలో చోటుదక్కవచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముఖ్యమంత్రి యడియూప్పతోపాటు కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 18. సంఖ్యను 34కు పెంచుకోవాలని సీఎం యోచిస్తున్నారు. ఖాళీగా ఉన్న 16 స్థానాలు భర్తీకి ఏర్పాట్లు చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అనర్హతవేటు పడ్డ ఎమ్మెల్యేలందరూ బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపుఓటములు సంగతి ఎలా ఉన్నా వారందరినీ మంత్రులను చేస్తారన్న కథనాలు వెలువడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఉమేష్ కత్తి మంత్రి పదవిపై ధీమాగా ఉన్నారు. యడియూరప్ప కచ్చితంగా బెర్త్ కేటాయిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నాటకలోని అధికార బీజేపీ బలనిరూపణకు ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం. 224 స్ధానాలున్న అసెంబ్లీలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. మస్కీ,ఆర్‌ఆర్ నగర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గురువారం జరిగే ఉప ఎన్నికల్లో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి బీజేపీ నిలబెట్టింది. ఈనెల 9న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.
*చిత్రం...కర్నాటక సీఎం యడియూరప్ప