జాతీయ వార్తలు

సీసీఐని వెంటనే తెరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని టీఆర్‌ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. లింగయ్య యాదవ్ సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో సీసీఐ పునఃప్రారంభం గురించి ప్రస్తావించారు. వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతంలోని సీసీఐని మూసివేయడం వలన యువతకు ఉపాధి లేకుండాపోయిందన్నారు. సీసీఐని పునఃప్రారంభించేందుకు అనువైన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయని ఆయన చెప్పారు. జాతీయ రహదారుల సంస్థ సీసీఐలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నదన్నారు. సీసీఐలో ఉత్పత్తి అయ్యే సిమెంటు జాతీయ రహదారుల నిర్మాణానికి ఉపయోగపడుతుందని యాదవ్ చెప్పారు. సీసీఐని పునఃప్రారంభించడం వలన తెలంగాణతో పాటు మహారాష్టల్రోని పలు ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు. సీసీఐని పునఃప్రారంభించడం వలన ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా మరో మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని లింగయ్య యాదవ్ సభకు వివరించారు. ఆదిలాబాద్‌లో దాదాపు వంద సంవత్సరాలకు సరిపడా ముడి సరుకు లభ్యత ఉన్నదంటూ దీని ఆదారంగా సీసీఐని పునఃప్రారంభించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు.