జాతీయ వార్తలు

ముందుకు వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహారాష్టల్రో శివసేన, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీ గురువారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన 10 జనపథ్‌లో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితి గురించి కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం దాని వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ మీడితో మాట్లాడారు. ఇప్పటికే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీతో మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటుపై జరిపిన చర్చల గురించి వర్కింగ్ కమిటీలో వివరించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం శుక్రవారం వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. శివసేన ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వెళ్లాలన్న దానిపై వర్కింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మరో 24 గంటల్లోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని ఈ వర్గాలు తెలిపాయి. మరోసారి కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సమావేశమై తమ వ్యూహానికి మరింత స్పష్టతను చేకూరుస్తారని, అనంతరం ముంబయిలో శివసేనతో ఈ రెండు పార్టీల నేతలు శుక్రవారం తుది సమావేశం జరుపుతారని ఈ వర్గాలు తెలిపాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయాన్ని కూడా ఈ మూడు పార్టీల నేతలు ముంబయిలోనే ప్రకటించే అవకాశం ఉంటుందని వెల్లడించాయి. కాగా మహారాష్ట్ర రాజకీయ అనిశ్చితికి త్వరలోనే తెరపడబోతోందని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలిస్తేనే సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని, ఇతర అంశాలను పక్కనపెట్టి ఈ రెండు పార్టీలు శివసేనతో చేతులు కలపడం అనివార్యమని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. శివసేనతో తాము ఎందుకు చేతులు కలుపుతున్నామన్న దానిపై కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఇప్పటికే నిర్ద్వంద్వ ప్రకటన చేసిందని ఆయన వెల్లడించారు. ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి పదవి వంతుల వారీగానే ఉంటుందని, మొదటి దశ శివసేన, రెండో దశలో ఎన్సీపీలు ఈ పదవిని పంచుకునే అవకాశం ఉందని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్లు ఉండేలా ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశం కూడా ఈ వర్గాలు తెలిపాయి.
*చిత్రం... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ