జాతీయ వార్తలు

లైసెన్స్ ఫీజు బకాయిల రద్దు యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టెలికాం రంగంలోని కంపెనీలు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజును రద్దు చేసే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. లోక్‌సభలో బుధవారం ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ పెనాల్టీలు లేదా వడ్డీలను స్థూల ఆదాయం కింద పరిగణించే అవకాశం లేదని అన్నారు. ఈ విషయంపై కేబినెట్ కార్యదర్శి ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారని పేర్కొన్నారు. 2017 ఆగస్టు నాటికి టెలికాం సంస్థల ఆస్తులు సుమారు 7.87 లక్షల కోట్ల రూపాయలని ఆయన చెప్పారు. దేశంలో 16 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నాయని, వీటి నుంచి కేంద్రానికి అందాల్సిన లైసెన్స్ ఫీజు 92,642 కోట్ల రూపాయలని ఆయన వివరించారు. స్థూల ఆదాయంలో ఇలాంటి మొత్తాలను చేర్చవద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వొడాఫోన్ గ్రూప్ నుంచి 28,309 కోట్ల రూపాయలు, భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ నుంచి 21,682 కోట్ల రూపాయలు, టెలినార్ నుంచి 1,950 కోట్ల రూపాయలు, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి 9,987 కోట్ల రూపాయల మేర లైసెన్స్ ఫీజు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ భారీ మొత్తాలను రద్దు చేయాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని ఆయన తేల్చిచెప్పారు.