జాతీయ వార్తలు

574 రైల్వేస్టేషన్‌లకు ఉచిత హైస్పీడ్ వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: దక్షిణ మధ్య రైల్వేలోని 574 రైల్వేస్టేషన్‌లకు పూర్తి స్థాయిలో ఉచిత హైస్పీడ్ - వైఫై సౌకర్యాన్ని విస్తరించనున్నారు. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏ-1, ఏ,బీ,సీ,డీ,ఇ కేటగిరీలకు చెందిన అన్ని స్టేషన్‌లకు ఈ సౌకర్యాన్ని విస్తరింప చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. పూర్తి స్థాయిలో వైఫై సౌకర్యం కల్పిస్తున్న జోన్‌ల్లో దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ మధ్య రైల్వేలో ఉచిత వైఫై సౌకర్యాలు తొలుత సికింద్రాబాద్ స్టేషన్‌లో 2015లో ప్రారంభమయ్యాయి. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఈ సౌకర్యం 574 స్టేషన్‌లకు విస్తరించడమనేది గొప్ప విషయం.