జాతీయ వార్తలు

నేటి నుంచి గోవాలో ‘బాలల చిత్రాల’ పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, నవంబర్ 20: భారత్-విదేశాల్లో నిర్మించిన ప్రఖ్యాత బాలల చలనచిత్రాలను తిలకించే అవకాశం నేటి నుంచి గోవా ప్రజలకు దక్కనుంది. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని పురస్కరించుకొని గోవా థియేటర్లలో బాలల చిత్రాలను ప్రదర్శించనున్నారు. మొబైల్ థియేటర్ కంపెనీ పిక్చర్ టైం, ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) భాగస్వామ్యంతో బాలల చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ చలన చిత్రోత్సవ కార్యక్రమాన్ని గురువారం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా ప్రముఖంగా బాలల చిత్రాలు ముఖ్యంగా భారత్‌తో పాటు విదేశాల్లో నిర్మించిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఐజాజ్‌ఖాన్ నిర్మించిన కాశ్మీర్ సెట్ ‘హమీద్’ను ఇందులో ప్రదర్శిస్తారు. జాతీయ అవార్డు పొందిన ఉర్దూ చిత్రమిది. ‘50వ ఇఫీ చలనచిత్రోత్సవాల సందర్భంగా ఈఎస్‌జీతో మాకు అనుబంధాన్ని ప్రకటించడానికి ఎంతో ఆనందిస్తున్నా.. మళ్లీ వీరితో కలిసి పనిచేసే అవకాశం లభించింది’ అని బాలల చలనచిత్రోత్స వ నిర్వాహక సంస్థ అయిన పిక్చర్ టైం సీఈవో సుశీల్ చౌదరి పేర్కొన్నారు.