జాతీయ వార్తలు

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2019’ అవార్డు లభించింది. ఈ అవార్డును కేంద్ర వాణిజ్య, ఎరువులు శాఖ మంత్రి సదానంద గౌడ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరంతరం చేస్తున్న కృషితో రాష్ట్రంలో పారిశుద్ధ్యం ఎంతో మెరుగైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచుల చొరవతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన పల్లె ప్రగతి (30 రోజుల ప్రత్యేక ప్రణాళిక) తోనే ఇది సాధ్యమైందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితుల్లో ఎంతో మెరుగయ్యాయని పేర్కొన్నారు. సాధారణ పరిసరాలతోపాటు స్కూళ్లు అంగన్వాడీలు, పీహెచ్‌సీలు, సంతలు ఇలా అన్ని పబ్లిక్ స్థలాల్లో, గ్రామాల్లోని ప్రతి ఇంటి ఆవరణలో పరిశుభ్రత పెరిగిందన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు నిర్మాణాన్ని నిర్మించే దిశగా పనులు చేపట్టిందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. అలాగే త్వరలో తెలంగాణలో
జరిగే మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించినట్టు చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ఈజీఎస్ కార్యక్రమం ద్వారా మనకు రావలసిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. రూ.1200 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చే అవకాశం వుందన్నారు. ఆర్‌జీఎస్‌వై కింద గ్రామ సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడానికి సంబందించి రూ.100కోట్లు విడుదల చేయమని కేంద్ర ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ భవన్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులతోపాటు పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, కవిత, లింగయ్య యాదవ్, సీఆర్‌డీ కమిషనర్ రఘునందన్, రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...కేంద్ర మంత్రి సదానంద గౌడ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు