జాతీయ వార్తలు

మైనారిటీ ఉగ్రవాదం అంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: మైనారిటీ ఉగ్రవాదం అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం మమత సమాజంలో కుల, మతాల చిచ్చు రేపుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. అసలేం జరిగిందంటే.. బెంగాల్‌లోని కూచ్‌బీహార్ ప్రాంతంలో సోమవారం జరిగిన ఓ ర్యాలీలో మమత ప్రసంగిస్తూ ఉగ్రవాదం మైనారిటీల్లో పెంపొందుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలకు చెందిన ఓ పార్టీ బీజేపీ నుంచి డబ్బులు తీసుకుంటున్నదని ఆరోపించారు. ఆ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో లేదని, హైదరాబాద్‌లో ఉందని విరుచుకుపడ్డారు. అయితే మమత తన ప్రసంగంలో ఎక్కడా మజ్లిస్ పార్టీ గురించి గానీ, అసదుద్దీన్ ఓవైసీ పేరును గానీ ప్రస్తావించలేదు. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ఘాటుగా ప్రతిస్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో మజ్లిస్ పార్టీ
బలపడుతున్నదన్న భయం, అసహనంతోనే మమత తమ గురించి మాట్లాడారని అసద్ తెలిపారు. మరోవైపు బెంగాల్‌లో బీజేపీ చొచ్చుకుని రావడంతో మమత తన స్వరాన్ని మార్చి, మైనారిటీల గురించి మాట్లాడారని.. ముస్లిం ఓట్లకోసం పొగుడుతున్నారని అన్నారు. ముస్లింలకు ఇప్పటివరకు నమ్మక ద్రోహం చాలా జరిగిందన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై చేసిన వ్యాఖ్యలతో బెంగాల్‌లో మజ్లిస్ ఓ బలీయమైన శక్తిగా అవతరించబోతున్నదన్న సందేశాన్ని ముస్లింలకు ఇచ్చినట్లు అయిందని అసద్ తెలిపారు. మమత వ్యాఖ్యల్లో భయం, అసహనం బయటపడ్డాయని అన్నారు.

*చిత్రం...మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ