జాతీయ వార్తలు

2021 నాటికి పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబందించిన అంచనాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ ఆమోదించిందని కేంద్ర మంత్రి రతన్‌లాల్ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతల్‌లాల్ కటారియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా విలువ రూ.55,548.87 కోట్లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో జలశక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ ఆమోదించిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటివరకు 67.09 శాతం పూర్తయిందని వివరించారు. పాజెక్టు నిర్మాణం 2021 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ప్రణాళికలు వేసినట్టు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ, బెకెం ఇన్ఫ్రా సంస్థలను తప్పించి మిగిలిన పనులను మేఘా ఇంజినీరింగ్ నిర్మాణ సంస్థకు అప్పగించినట్టు మంత్రి వెల్లడించారు.