జాతీయ వార్తలు

పాక్, ఉగ్రవాద సంస్థలు కాశ్మీరీలను రెచ్చగొడుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 18: పాకిస్తాన్‌తో పాటు ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టడమే కాకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నాయని డీజీపీ దిల్‌బగ్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడి జిల్లా పోలీస్ కార్యాలయంలో జోనల్ సైబర్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలతో పాటు భద్రతా పరమైన అంశాలపై సింగ్ సమీక్షించినట్లు పోలీసు శాఖ అధికార ప్రతినిధి సోమవారం ఇక్కడ తెలియజేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొడుతూ.. భయభ్రాంతులకు గురిచేసే అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీనియర్ పోలీసు అధికారులకు డీజీపీ సూచించారు. జమ్మూ కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసులను డీజీపీ ఈ సందర్భంగా అభినందించారు. ఉగ్రమూకల చర్యలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టడంలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల విధ్వంసాలను తిప్పికొట్టడంలో చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉందని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, భద్రతా పరమైన చర్యలు, ఉగ్రవాద చర్యలను ముందస్తుగా తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహరచనలపై సీనియర్ పోలీసు అధికారుల నుంచి విడివిడిగా అడిగి తెలుసుకొన్నారు.