జాతీయ వార్తలు

సజావుగా సభ నడిపేందుకు సహచరులమవుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కోరుకునే విధంగా సభ కొనసాగేలా చూసేందుకు మనమంతా ప్రయత్నించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ్యులందరికీ సూచించారు. రాజ్యసభ కొనసాగుతున్న తీరు పట్ల వెంకయ్య నాయుడు ఎంతో బాధను వ్యక్తం చేశారు. ఆయన బాధతో తాను ఏకీభవిస్తున్నానని నరేంద్ర మోదీ చెప్పారు. సభ సజావుగా జరిగేలా చూసేందుకు సభ్యులందరూ సహకరించాలని ప్రధాన మంత్రి తెలిపారు. దీనికి వెంకయ్య నాయుడు వెంటనే స్పందిస్తూ దేశానికి నష్టం కలుగుతుంటే తనకు బాధ కలుగుతుంది.. ఇతరత్రా కాదని అన్నారు. సభ నిర్వహణలో అధ్యక్షుడికి తక్కువలో తక్కువ కష్టం కలిగించే విధంగా మనమంతా వ్యవహరిస్తామనే సంకల్పం తీసుకోవాలని నరేంద్ర మోదీ ఇరుపక్షాల సభ్యులకు సూచించారు. వెంకయ్య నాయుడు భావాలను ఆదరించవలసి అవసరం ఉన్నదని మోదీ స్పష్టం చేశారు. మీరు అనుకునే విధంగా ‘సభను నడిపించేందుకు తామంతా మీ సహచరులం అవుతాం’ అని మోదీ హామీ ఇచ్చారు. క్రమశిక్షణ పాటిస్తూ సభ కొనసాగేందుకు సహకరిస్తామన్నారు. వెంకయ్య నాయుడు అంతకుముందు రాజ్యసభలో 250వ సమావేశంపై ప్రత్యేక చర్చను ప్రారంభిస్తూ పలువురు సభ్యులు కమిటీ సమావేశాలకు హాజరు కాకపోవటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జయరాం రమేష్ నాయకత్వంలోని ఒక స్టాండింగ్ కమిటీ సకాలంలో తమ చర్చలు ముగించి నివేదికను కూడా సిద్ధం చేయగా మరో కమిటీ సమావేశం మాత్రం సక్రమంగా జరగటం లేదన్నారు. వెంకయ్య నాయుడు ఈ కమిటీ పేరెత్తకుండా ఇటీవల దీని సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు 28 మంది సభ్యుల నుండి కేవలం ఐదుగురు మాత్రమే హాజరు కావటం బాధ కలిగించిందని చెప్పారు. రాజ్యసభ కమిటీ సమావేశాలకు సంబందిత సభ్యులు హాజరుకాకపోవటం ఎంతమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.
*చిత్రం... సభలో మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు