జాతీయ వార్తలు

ఆర్‌బీఐ అభ్యంతరం బుట్టదాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఎన్నికల బాండ్లను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దొడ్డిదారిన నల్లధనం బీజేపీ ఖజానాలోకి వచ్చే విధంగా ఆర్‌బీఐ నిబంధనలను సైతం బేఖాతరు చేస్తూ ఎన్నికల బాండ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆరోపించింది. ఏవిధంగా చూసినా కూడా ఈ ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం మనీ లాండరింగ్‌ను ప్రోత్సహించడమేనని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ బాండ్లను కొన్నవారి పేర్లను బహిర్గతం చేయాలని, ఈ మొత్తం వ్యవహారంలో చోటుచేసుకున్న ‘ఇచ్చి పుచ్చుకునే’ తతంగాన్ని ఎండగట్టాలని కాంగ్రెస్ ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ గౌడ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన మీడియా కథనాలను ఉటంకించిన ఆయన ‘ఈ బాండ్లను విడుదల చేయడానికి కేవలం కొన్ని రోజుల ముందే ప్రభుత్వం ఆర్‌బీఐ అభిప్రాయం కోరింది. కానీ ఆర్‌బీఐ అభ్యంతరాలను తిరస్కరించింది’ అని అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కేంద్రాన్ని తప్పుపట్టారు. ఆర్‌బీఐ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల బాండ్లను ప్రభుత్వం విడుదల చేసిందని, బీజేపీ ఖజానా నింపుకోవడానికి జాతీయ భద్రతకు కూడా తూట్లు పొడిచిందని ప్రియాంక విమర్శించారు. దేశంలోని నల్లధనాన్ని రూపుమాపుతామన్న వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఆ నల్లధనంతోనే జేబులు నింపుకుంటోందని ఆమె ధ్వజమెత్తారు. ఏవిధంగా చూసినా ఇది సిగ్గుచేటైన చర్య అని, దేశ ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆమె అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రాజీవ్ గౌడ ఎన్నికల బాండ్ల పథకమే ఓ పెద్ద బూటకమని, దీనివల్ల సమతూక పరిస్థితులకు సమాధి కట్టినట్టే అవుతుందని అన్నారు. దేశ ప్రజలపైనా ఎన్నికల ప్రక్రియపైనా జరిగిన ఓ దగాకోరు చర్యగా ఎన్నికల బాండ్ల ప్రక్రియను ఆయన అభివర్ణించారు. మనీ బిల్లుగానే ఈ పథకాన్ని ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి కారణం ఎలాంటి సవరణలకు ఆస్కారం ఇవ్వకపోవడమేనని గౌడ తెలిపారు. ఈ బిల్లులో ఎలాంటి పారదర్శకత లేకపోవడం వల్లే ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి గోప్యతా లేకపోతే ఈ బాండ్లను ఇప్పటివరకు కొన్నవారి పేర్లను, సంస్థల పేర్లను బయటపెట్టాలని బీజేపీని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల బాండ్ల లావాదేవీల వెనుక ప్రభుత్వం ఎవరికి ఎంతగా లబ్ధి చేకూర్చిందో కూడా దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ ఆస్తులను తమ సన్నిహితులకు విక్రయించడంతోపాటు ప్రభుత్వం విధానపరంగా కొద్దిమందికి అనేక ప్రయోజనాలు చేకూర్చిందని తెలిపారు. ఇప్పటికే ఆర్‌బీఐ, అలాగే ఎన్నికల కమిషన్ కూడా ప్రశ్నించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన అన్నారు. ఆర్‌బీఐ మాట కాదని, అవినీతిని ప్రోత్సహించే ఈ పథకంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఎందుకు నిర్ణయం తీసుకుందో దర్యాప్తు ద్వారా వెల్లడి కావాలని ఆయన అన్నారు.

*చిత్రం... కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ