జాతీయ వార్తలు

అయ్యప్పకు తొలి రోజు ఆదాయం రూ.3.30 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల, నవంబర్ 18: శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి తొలి రోజే రూ.3.30 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయ్యప్ప ఆలయాన్ని ఈ నెల 16న (శనివారం) సాయంత్రం తెరిచిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. 70 వేల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. గత ఏడాది ఆలయం ద్వారాలు తెరిచిన తర్వాత తొలి రోజున స్వామి వారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలు (నగదు రూపంలో) రూ.1.28 కోట్లు లభించిందని ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు (టీడీబి) అధ్యక్షుడు ఎన్.వాసు సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. అసంఖ్యాకంగా వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. దీనికి భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన వివరించారు. గత ఏడాది ఆలయం తెరిచిన రోజే గొడవ జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని సుప్రీం కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావించడంతో సమస్య తలెత్తిందన్నారు. ఈ ఏడాది అటువంటి వివాదం ఏమీ లేదని, భక్తులు ప్రశాంతంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని వెనుదిరుగుతున్నారని ఆయన తెలిపారు. సుమారు 40 వేల మంది భక్తులకు ‘అన్నదానం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరమైనంత తాగు నీరు సిద్ధంగా ఉంచామని వాసు తెలిపారు. శబరిమల ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇలాఉండగా అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న అంశంపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై తీర్పు వెలువడనందున టీడీబీగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ మహిళలను అనుమతించడం లేదు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసిం ది. శనివారం ఏపీకు చెందిన 10 మంది మహిళలు అయ్యప్ప దర్శనార్థం చేరుకోగా, పంబ వద్దే పోలీసులు వారికి అడ్డుచెప్పారు. పోలీసులతో మహిళలు వాగ్వావాదానికి దిగారు. ప్రభుత్వ ఆదేశంతోనే తాము అనుమతించడం లేదని పోలీసులు వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించారు.

*చిత్రం... స్వామి అయ్యప్ప దర్శనం కోసం సోమవారం పెద్ద సంఖ్యలో క్యూ కట్టిన భక్తులు