జాతీయ వార్తలు

బాల్ థాకరేకు శివసేన, బీజేపీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 17: శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే తొమ్మిదో వర్ధంతిని ఇటు శివసేన నేతలతో పాటు బీజేపీ నేతలు వేర్వేరుగా నిర్వహించారు. ఆదివారం ఇక్కడి శివాజీ పార్కులో జరిగిన బాల్ థాకరే ఏడవ వర్ధంతి కార్యక్రమానికి ఇరు పార్టీల నేతలు వేర్వేరుగా విచ్చేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు అంశంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు విడివిడిగా థాకరేకు నివాళులు అర్పించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆయన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే ఆదిత్య, పలువురు పార్టీ నేతలు ఉదయం పది గంటల నుంచి 12 గంటల మధ్య శివాజీ పార్కులోని స్మారక కేంద్రానికి విచ్చేసి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బీజేపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తావ్దే, పంకజముండే తదితరులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ, శివసేన మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ఏర్పాట్లు చేసుకొంటున్న సంగతి తెలిసిందే.
ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ఇదిలా ఉండగా, ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ శివాజీ పార్కులో బాల్ థాకరేకు నివాళి అర్పించారు. ఈ సమయంలో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫడ్నవిస్‌కు వ్యతిరేకంగా సేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంలో ‘నేను సీఎంగా మళ్లీ వస్తా’ అంటూ చేసిన ఫడ్నవీస్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిని సేన కార్యకర్తలు నిరసిస్తూ కాబోయే ముఖ్యమంత్రి శివసేన నాయకత్వం నుంచే ఉంటారంటూ సవాలు విసిరారు. బాల్ థాకరే సంబంధించిన కొన్ని వీడియో సందేశాలను ఫడ్నవిస్ ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుత శివసేన నాయకత్వాన్ని ఉటంకిస్తూ ‘గౌరవం, అహంకారం’ పేరిట థాకరే ప్రసంగాలతో కూడిన క్లిప్పింగ్‌లను పడ్నవీస్ షేర్ చేయడం కలకలం రేపింది. థాకరేకు నివాళులర్పించడానికి ఫడ్నవీస్ వచ్చిన సమయంలో బీజేపీ నేతలతో అధిక సంఖ్యలో ఉండగా కేవలం ఉద్ధవ్ థాకరే పీఏ ఒక్కరే శివాజీ పార్కులో ఉన్నారు.
*చిత్రం... శివసేన సంస్థాపకుడు బాలా సాహెబ్ థాకరే ఏడవ వర్ధంతి సందర్భంగా ఆదివారం ముంబయిలో నివాళులు అర్పిస్తున్న పార్టీ కార్యకర్తలు