జాతీయ వార్తలు

చర్చకు అవకాశమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విభజన సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు అవకాశమివ్వాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్టు టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రధాని సమక్షంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. సమావేశాల్లో 27 బిల్లులు ప్రవేశపెడతామని కేంద్రం జాబితా ఇచ్చిందన్నారు. పార్లమెంట్‌లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడంతో పాటుగా ప్రజా సమస్యలపై చర్చించాలని కోరామని అన్నారు. పార్లమెంట్
సమావేశాల్లో వారానికి ఒక్కరోజైన 193వ నిబంధన కింద ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో చర్చించాలని కోరినట్టు చెప్పారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో వున్న అంశాలను సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎన్నో అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తులు అందజేసినా, చాలా అంశాలు పెండింగ్‌లో వున్నాయని తెలిపారు. వీటన్నింటినీ పార్లమెంట్‌లో లేవనెత్తుతామని అన్నారు. కాలుష్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై చర్చ జరగాలని కోరినట్టు నామా నాగేశ్వరరావు చెప్పారు.
*చిత్రం... టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు