జాతీయ వార్తలు

విభజన హామీలు నిలుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడు మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు
విపక్షాలు ప్రయత్నిస్తున్న విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో లెవనేత్తినట్టు చెప్పారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో రూ.800కోట్లు ఆదా చేసినట్లు ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను టెక్నికల్ కమిటీ ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని.. రాష్ట్రంలో 7 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బుందేల్‌ఖండ్ తరహాలో ఏపీలో వెనకబడిన జిల్లాలకు ప్యాకేజి ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ప్యాకేజీ కేంద్ర ప్రకటిస్తే ఏపీకి రూ.24000కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావని కోరినట్టు చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం జైల్లో వున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరాన్ని పార్లమెంట్‌కు హాజరయ్యేలా అనుమతించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ సమావేశంలో కోరినట్టు చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టిన సమయంలో పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరితే కాంగ్రెస్ పార్టీ అనుమతించ లేదని గుర్తు చేసినట్టు చెప్పారు. చిదంబరానికి ఒక న్యాయం.. వైఎస్ జగన్‌కు మరొక న్యాయం ఉండకూడదని అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తమ అధినేతపై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలపాటు నిర్బంధించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపించారు. చిన్న పార్టీలకు కూడా సభలో కనీసం పది నిమిషాలపాటు మాట్లాడే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరినట్టు విజయ సాయిరెడ్డి చెప్పారు.

*చిత్రం... వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి