జాతీయ వార్తలు

తీర్పుల్లో తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్, నవంబర్ 17: దశాబ్దాలుగా సాగిన వివాదాస్పద అయోధ్య కేసు విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నాణ్యతాయుతమైన తీర్పులకు, ఇందుకోసం న్యాయవ్యవస్థ చేసే కృషికి నిలువుటద్దంగా నిలుస్తోందని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్.షా ఇక్కడ అన్నారు. అన్ని అంశాలను సమగ్ర రీతిలో శోధించి, పరిశోధించి, వాస్తవికతలను రంగరిస్తే తప్ప ఈ రకమైన నాణ్యతా తీర్పులు వెలువడే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో తీర్పుల జాప్యంపై నిర్మా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు ముడిపడి ఉంటే తప్ప ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తులు నిష్క్రమించకూడదని షా స్పష్టం చేశారు. నాణ్యతాయుతమైన తీర్పులు, వాటిలో వెలువరించే విషయంలో న్యాయమూర్తులు పట్టుదలగా చేస్తున్న కృషికి నీరాజనాలు అందుతున్నప్పటికీ పేరుకుపోతున్న కేసులు, పరిష్కారంలో జాప్యం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ తలమానికతకు రామ జన్మభూమి తీర్పు తిరుగులేని నిదర్శనమని, ఈ తీర్పు ఇవ్వడానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పడ్డ శ్రమను ఊహించుకోలేమని ఆయన పేర్కొన్నారు. అత్యంత ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశంపై 40 రోజులపాటు దైనందినంగా విచారించడం, ఏ పక్షం నొచ్చుకోకుండా సమతూకంతో సమగ్ర దృష్టితో తీర్పును వెలువరించడం అత్యంత సంక్షిష్టమైన వ్యవహారమని షా తెలిపారు. రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఈనెల 9న చారిత్రక రీతిలో అయోధ్య తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. నేర న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకం వేగంగా విచారణ జరిపి కేసులను తేల్చడమేనని, అయితే ఈ అతి వేగం వల్ల బాధితులకు న్యాయం అందకపోయే అవకాశం కూడా లేకపోదని షా అన్నారు. వేగంగా వెళ్లకుండా అటు న్యాయానికి అన్యాయం జరుగుకుండా సమతూకంతోనే విజ్ఞతో వ్యవహరించి తీర్పును వెలువరించాల్సి ఉంటుందని అన్నారు. న్యాయ పాలనలో జాప్యం జరుగుకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేయాలని జస్టిస్ షా సూచించారు. జనాభా పెరుగుదల, వాటికి అనుగుణంగా కోర్టుల సంఖ్య లేకపోవడం, న్యాయమూర్తుల నియామకం జరగకపోవడం, అధ్వాన్నమైన వౌలిక సదుపాయాలు, కంప్యూటరీకరణలో మందగమనం, సమాచార టెక్నాలజీ వినియోగం వంటి అంశాలు దీర్ఘకాలంగా కేసులు పెండింగ్‌లో పడడానికి కారణం అవుతున్నాయని అన్నారు. అలాగే, న్యాయవాదులు అనవసరంగా కేసులను వాయిదా కోరడం వల్ల కూడా వీటి పరిష్కారంలో జాప్యం జరుగుతోందని షా తెలిపారు. క్రిమినల్ కేసులను వేగవంతంగా విచారించడంలో న్యాయవాదులే అవరోధం గా మారుతున్నారని, అందుకు వారు కోరే వాయిదాలే కారణమని తెలిపారు. ఇటీవల కాలంలో అనేక కీలక కేసుల విచారణ నుంచి న్యాయమూర్తులు తప్పుకుంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన షా వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి ఉన్న పక్షంలో మాత్రమే ఆయా కేసుల నుంచి న్యాయమూర్తుల నిష్క్రమణను అనుమతించాలని అన్నా రు. అత్యంత బలమైన కారణం ఉంటే తప్ప ఇం దుకు ఏ న్యాయమూర్తినీ అనుమతించకూడదని, లేనిపక్షంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ప్రయోజనాలే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అన్నారు. కోర్టుల వెలుపల కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రోత్సహించాలని పేర్కొన్న ఆయన అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
*చిత్రం... న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్.షా